ఇది ఇంకో కధ పిల్లలకి నచ్చుతుంది :
అనగా అనగా,
ఒక వూరిలో ఒక ఈగ వుండేది . అది ఇల్లు అలుకుతూ పేరు దాని మరిచిపోయంది.
అపుడు అది ఒక పేదరాశి పెద్దమ్మ దగ్గరకి వెళ్లి "పెద్దమ్మా పెద్దమ్మా ! నా పేరు ఏంటి అని అడిగింది".
అపుడు ఆ పేదరాశి పెద్దమ్మ "ఏమో ! నాకు తెలీదు ! అక్కడ చెట్టుని కొడుతున్న మా అబ్బాయిని అడుగు" అని అంది .
అపుడు ఆ ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - నా పేరు ఏంటి?" అని అడిగింది .
అపుడు వాడు "ఏమో ! నాకు తెలీదు ! నా చేతిలో వున్న గొడ్డలిని అడుగు" అని అన్నాడు.
అపుడు ఆ ఈగ గొడ్డలి దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - నా పేరు ఏంటి?" అని అడిగింది
అపుడు ఆ గొడ్డలి "ఏమో ! నాకు కూడా తెలీదు ! నేను కొడుతున్న చెట్టును అడుగు" అని అంది.
అపుడు ఆ ఈగ చెట్టు మీద వాలి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - నా పేరు ఏంటి?" అని అడిగింది.
అపుడు ఆ చెట్టు "ఏమో ! నాకూ తెలీదు ! నా మీద వాలి వున్న పిట్టలని అడుగు" అని అంది.
అపుడు ఆ ఈగ చెట్టు మీద వాలి వున్న పిట్టల దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలార - నా పేరు ఏంటి?" అని అడిగింది.
అప్పుడు ఆ పిట్టలు "ఏమో ! మాకూ తెలీదు ! మమ్మల్ని పట్టుకోటానికి వచ్చే వేటగాళ్ళని అడుగు" అని అన్నాయి .
అపుడు ఆ ఈగ వేటగాళ్ళ దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలార - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళారా నా పేరు ఏంటి?" అని అడిగింది.
అప్పుడు ఆ వేటగాళ్ళు "ఏమో ! మాకూ తెలీదు ! మాకు వంట చేసి పెట్టె అమ్మలక్కలని అడుగు" అని అన్నారు.
అపుడు ఆ ఈగ అమ్మలక్కల దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలారా - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టె అమ్మలక్కలారా నా పేరు ఏంటి?" అని అడిగింది.
అప్పుడు ఆ అమ్మలక్కలు "ఏమో ! మాకూ తెలీదు ! ఇప్పుడే రాజుగారు వచ్చి అన్నం తిని అక్కడ పడుకున్నారు, ఆయన్ని అడుగు" అని అన్నారు.
అపుడు ఆ ఈగ రాజు గారి దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలారా - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు - అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారూ - నా పేరు ఏంటి?" అని అడిగింది.
అప్పుడు ఆ రాజు గారు "ఏమో ! నాకు తెలీదు ! నేను ఎక్కి వచ్చిన గుఱ్ఱం ని అడుగు" అని అన్నారు.
అపుడు ఆ ఈగ రాజు గారి దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలారా - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు - అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారూ - రాజుగారు ఎక్కి వచ్చిన గుఱ్ఱమా - నా పేరు ఏంటి?" అని అడిగింది.
అప్పుడు ఆ గుఱ్ఱం "ఏమో ! నాకేమీ తెలీదు ! నా బొజ్జలో ఉన్న గుఱ్ఱం పిల్లని అడుగు" అని అంది .
అపుడు ఆ ఈగ గుఱ్ఱం బొజ్జ మీద వాలి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలారా - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు - అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారూ - రాజుగారు ఎక్కి వచ్చిన గుఱ్ఱమా - గుఱ్ఱం బొజ్జలో పిల్లా నా పేరు ఏంటి?" అని అడిగింది.
అప్పుడు ఆ గుఱ్ఱం పిల్ల "ఇహి... ఇహీ .. ఇహీ ... ఈగ "... అని అంది .
ఈగ కి దాని పేరు గుర్తుకి వచ్చి "నా పేరు ఈగ, నా పేరు ఈగ, నా పేరు ఈగ" అనుకుంటూ ఇల్లు అలుక్కోటానికి ఎగురుకుంటూ వెళిపోయింది.
.

No comments:
Post a Comment