Sunday, June 22, 2014

Telugu Small Story- Eedu chepala kadha - రాజు గారి పిల్లలు - ఏడు చేపలు కధ

అనగా అనగా ,

ఒక వూరిలో ఒక రాజుగారు వున్నారు. ఆ రాజు గారికి ఏడుగురు కొడుకులు వున్నారు. 

ఏడుగురు కొడుకులూ ఒక రోజు చెరువుకి వెళ్లి ఏడు చేపలు పట్టి తెచ్చి ఎండలో పెట్టారు.

సాయంత్రం చూసేసరికి ఆ ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.

"చేపా చేపా ఎందుకు ఎండలేదు ?" అని అడిగారు ఆ రాజుగారి కొడుకులు.

"నాకు గడ్డి వాము అడ్డు వచ్చింది" అని అంది ఆ చేప.

అప్పుడు రాజుగారి కొడుకులు గడ్డి వాము దగ్గరకి వెళ్లి "గడ్డి వాము గడ్డి వాము, ఎందుకు అడ్డు వచ్చావు?" అని అడిగారు.

అప్పుడు గడ్డి వాము "నన్ను ఆవు మేయ లేదు" అని అంది.

అప్పుడు రాజుగారి కొడుకులు ఆవు దగ్గరకి వెళ్లి "ఆవూ  ఆవూ, నువ్వు గడ్డివాముని  ఎందుకు మేయ్యలేదు?" అని అడిగారు.

అప్పడు ఆవు  "పెయ్య పాలు తాగలేదు" అని అంది.

అప్పుడు రాజుగారి కొడుకులు పెయ్య దగ్గరకి వెళ్లి "పెయ్యా పెయ్యా, నువ్వు పాలు ఎందుకు తాగలేదు?" అని అడిగారు.

అప్పడు పెయ్య "పాలెగాడు నన్ను వదలలేదు" అని అంది .

అప్పుడు రాజుగారి కొడుకులు పాలెగాడు దగ్గరకి వెళ్లి "పాలెగాడా పాలెగాడా, నువ్వు పెయ్యని ఎందుకు వదలలేదు?" అని అడిగారు.

అప్పుడు పాలెగాడు "పాప ఏడ్చింది" అని అన్నాడు

అప్పుడు రాజుగారి కొడుకులు పాప దగ్గరకి వెళ్లి "పాపా పాపా, నువ్వు ఎందుకు ఎడ్చావు?" అని అడిగారు.

అప్పుడు పాప "నన్ను చీమ కుట్టింది" అని చెప్పింది.

అప్పుడు రాజుగారి కొడుకులు పాప దగ్గరకి వెళ్లి "చీమా చీమా, నువ్వు పాపని ఎందుకు కుట్టావు?" అని అడిగారు.

అప్పుడు చీమ ఏమనింది అంటే ... ఏమనింది అంటే ... "నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా?"

అప్పుడు రాజుగారి పిల్లలకి ఒక సమస్య వెనక ఎన్నో సమస్యలు, కారణాలు వుంటాయి అని అర్ధమయ్యింది.

గమనిక: ఈ కధ లో పిల్లల మది లో ప్రశ్నలు ఎలా వస్తాయో, వాళ్ళకి కారణాలు తెలుసుకోవాలి అన్న అభిలాష ఎలా వుంటుందో పెద్దవాళ్ళకి అర్ధమవుతుంది.



 

Saturday, June 21, 2014

Eega Telugu Small Story - పేరు మరిచిపోయిన ఈగ కధ

ఇది ఇంకో కధ పిల్లలకి నచ్చుతుంది :

అనగా అనగా,

ఒక వూరిలో ఒక ఈగ వుండేది . అది ఇల్లు అలుకుతూ పేరు దాని మరిచిపోయంది.

అపుడు అది ఒక పేదరాశి పెద్దమ్మ దగ్గరకి వెళ్లి "పెద్దమ్మా పెద్దమ్మా ! నా పేరు ఏంటి అని అడిగింది".
అపుడు ఆ పేదరాశి పెద్దమ్మ "ఏమో ! నాకు తెలీదు ! అక్కడ చెట్టుని  కొడుతున్న మా అబ్బాయిని అడుగు" అని అంది .

అపుడు ఆ ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - నా పేరు ఏంటి?" అని అడిగింది .

అపుడు వాడు "ఏమో ! నాకు తెలీదు ! నా చేతిలో వున్న గొడ్డలిని అడుగు" అని అన్నాడు.

 అపుడు ఆ ఈగ గొడ్డలి దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - నా పేరు ఏంటి?" అని అడిగింది

అపుడు ఆ గొడ్డలి  "ఏమో ! నాకు కూడా తెలీదు ! నేను కొడుతున్న చెట్టును అడుగు" అని అంది.

అపుడు ఆ ఈగ చెట్టు మీద వాలి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - నా పేరు ఏంటి?" అని అడిగింది.

అపుడు ఆ చెట్టు "ఏమో ! నాకూ తెలీదు ! నా మీద వాలి వున్న పిట్టలని  అడుగు" అని అంది.

అపుడు ఆ ఈగ చెట్టు మీద వాలి వున్న పిట్టల దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలార - నా పేరు ఏంటి?" అని అడిగింది.

అప్పుడు ఆ పిట్టలు  "ఏమో ! మాకూ తెలీదు ! మమ్మల్ని పట్టుకోటానికి వచ్చే వేటగాళ్ళని అడుగు" అని అన్నాయి .
 
అపుడు ఆ ఈగ వేటగాళ్ళ దగ్గరకి  వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలార - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళారా నా పేరు ఏంటి?" అని అడిగింది.

అప్పుడు ఆ  వేటగాళ్ళు  "ఏమో ! మాకూ తెలీదు ! మాకు వంట చేసి పెట్టె అమ్మలక్కలని అడుగు" అని అన్నారు.

అపుడు ఆ ఈగ అమ్మలక్కల దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలారా - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టె అమ్మలక్కలారా నా పేరు ఏంటి?" అని అడిగింది.

అప్పుడు ఆ  అమ్మలక్కలు  "ఏమో ! మాకూ తెలీదు ! ఇప్పుడే రాజుగారు వచ్చి అన్నం తిని అక్కడ పడుకున్నారు, ఆయన్ని అడుగు" అని అన్నారు.

అపుడు ఆ ఈగ రాజు గారి దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలారా - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు - అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారూ -  నా పేరు ఏంటి?" అని అడిగింది.

అప్పుడు ఆ  రాజు గారు  "ఏమో ! నాకు తెలీదు ! నేను ఎక్కి వచ్చిన గుఱ్ఱం ని అడుగు" అని అన్నారు.

అపుడు ఆ ఈగ రాజు గారి దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలారా - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు - అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారూ -  రాజుగారు ఎక్కి వచ్చిన గుఱ్ఱమా - నా పేరు ఏంటి?" అని అడిగింది.

అప్పుడు ఆ గుఱ్ఱం "ఏమో ! నాకేమీ తెలీదు ! నా బొజ్జలో ఉన్న గుఱ్ఱం పిల్లని అడుగు" అని అంది .

అపుడు ఆ ఈగ గుఱ్ఱం బొజ్జ మీద వాలి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలారా - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టే   అమ్మలక్కలు - అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారూ -  రాజుగారు ఎక్కి వచ్చిన గుఱ్ఱమా - గుఱ్ఱం బొజ్జలో పిల్లా నా పేరు ఏంటి?" అని అడిగింది.

అప్పుడు ఆ గుఱ్ఱం పిల్ల "ఇహి... ఇహీ .. ఇహీ ... ఈగ "... అని అంది .

ఈగ కి దాని పేరు గుర్తుకి వచ్చి "నా పేరు ఈగ, నా పేరు ఈగ, నా పేరు ఈగ" అనుకుంటూ ఇల్లు అలుక్కోటానికి ఎగురుకుంటూ వెళిపోయింది.
 





.

Small Stories (చిట్టి కధలు) - Mirapakaya Pottodu (మిరపకాయ్ పొట్టోడు)


ఈ కధ మా పిల్లలకి చాల  ఇష్టం. మీ పిల్లలకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. 

అనగనగా ఒక ఊర్లో ఓ మిరపకాయ్ పొట్టోడు ఉండేవాడు. ఆ మిరపకాయ్ పొట్టోడు రోజూ తనకున్న సొరకాయంత సైకిలెక్కి ఊర్లోకి వెళ్లి కష్టపడి పని చేసి బోలెడు డబ్బులు సంపాదించి బాదంకాయంత బంగారం కొనుక్కుని తన ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాలో, తను సంపాదించిన ఆ బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, ఆ బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేసాడు. 

ఓ రోజు మిరపకాయ్ పొట్టోడు తన సొరకాయంత సైకిలెక్కి పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఓ దోసకాయంత దొంగ మిరపకాయ్ పొట్టోడి ఈతకాయంత ఇంట్లోకి వచ్చి, గచ్చకాయంత గదిలో, ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టి, అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని పారిపోతాడు. 

ఆ రోజు సాయంత్రానికి మిరపకాయ్ పొట్టోడు తన ఈతకాయంత ఇంటికొచ్చి,  గచ్చకాయంత గదిలోకెళ్ళి,  బీరకాయంత బీరువాకున్న తాటికాయంత తాళం పగలగొట్టేసి అతను దాచుకున్న బాదంకాయంత బంగారం పోయిందని తెలుసుకుని, వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడున్న పొట్లకాయంత పోలీసుకి ఫిర్యాదు చేస్తాడు.

వెంటనే, ఆ పొట్లకాయంత పోలీసు తనకున్న మావిడికాయంత మోటారు సైకిలెక్కి వెళ్లి దోసకాయంత దొంగోడిని వెతికి పట్టుకుని, వాడి దగ్గరున్న బాదంకాయంత బంగారాన్ని తీసుకొని మిరపకాయ పొట్టోడికి ఇచ్చి,
ఆ దోసకాయంత దొంగోడిని నాలుగు తన్ని జామకాయంత జైల్లో పడేస్తాడు.

అప్పుడు మిరపకాయ పొట్టోడు తన సొరకాయంత సైకిలెక్కి, తన ఈతకాయంత ఇంటికెళ్ళి, గచ్చకాయంత గదిలో ఓ మూలనున్న బీరకాయంత బీరువాలో బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, దానికి తిరిగి తాటికాయంత తాళం వేస్కుని దాచేస్తాడు. 

ఇదీ కధ!   

Friday, June 20, 2014

Benefits of planting a tree

1. Trees are planted to provide shade. They also beautify the surroundings and used for landscaping.

2. Trees release water vapor into the atmosphere. This helps in keeping the atmosphere cool.

3. Trees provide oxygen needed by all living beings.

4. Leaves and roots of some trees can be used a medicine.

5. Trees will have calming effect on people. So trees planted on road sides will be helpful in easing traffic problems.

6. Trees can compliment and enrich the design of buildings and spaces.

7. Trees provide shelter to many birds, insects and animals.

8. Trees improve air quality by filtering harmful dust and pollutants such as carbon monoxide, sulfur dioxide.

9. Trees can feed people.

10. Tree shades save water reducing water evaporation in the areas where the shade is present.

11. Trees prevent soil erosion by holding the soil tightly.

12. Trees use carbon dioxide to make their food, and provide oxygen to us.

 

Telugu Moral Story - మేకపోతు గంభీర్యం

అనగా అనగా ,

అడవికి వెళ్ళిన మేకల మంద నుండి ఒక మేకపోతు తప్పిపోయినది. ఎంత వెతికినా ఆ  మేకపోతు ఆ మందకి కనిపించలేదు.

రాత్రి అయింది.  మేకపోతుకు దారి తెలీలెదు. అటు ఇటు తిరుగుతూ చివరకి ఒక కొండ గుహ కనపడితే లోపలకి పోయి పడుకుంది,

ఆ గుహలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. ఆ సింహం కొంతసేపటికి ఆ గుహకి వచ్చి అక్కడ పడుకున్న వేరే జంతువుని చూసింది. చీకట్లో మేకపోతు కళ్ళు మిల మిలా మెరుస్తూ వున్నాయి. పెద్ద గడ్డము రెండు కొమ్ములు ఉన్న ఆ వింత జంతువుని చూస్తే సింహానికి భయం వేసింది.

ఆ వింత జంతువు తనని చంపటానికి వచ్చిందేమో అనుకొని సింహం గుహలోకి వెళ్ళకుండా బయటే నిలబడిపోయింది.

మేకపోతుకి కూడా సింహాన్ని చూసేసరికి భయం వేసింది. కాని సింహం కూడా తనని చూసి భయపడుతోంది అని కనిపెట్టింది మెకపొతు. ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ రాత్రి అంతా గడిపేసింది మేకపోతు.

తెల్లారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకొని గుహ ముందుకు వచ్చి "ఎవరు నువ్వు?" అని గట్టిగా అడిగింది సింహాన్ని. సింహం "నేను సింహాన్ని, మృగ రాజును" అనింది.

అప్పుడు మేకపోతు "ఓహో నువ్వేనా ? ఆ సింహానివి, ఆ మృగ రాజువి, భలే దొరికావు - నీ గురించే వెతుకుతున్నాను చాల రోజుల నుంచీ, ఇప్పటికి దొరికావు - నేను ఇప్పటికే వెయ్య ఎనుగులని , వంద పులులని చంపాను, కాని ఇప్పటివరకు సింహాన్ని చంపలేదు - సింహాన్ని చంపేవరకు నా గడ్డాన్ని తీయనని ప్రతిజ్ఞ చేశాను - ఇప్పటికి దొరికావు - నిన్ను చంపి నా దీక్ష పూర్తి చేస్తాను - ఈ గడ్డానికి విముక్తి కలిగిస్తాను " అని అంటూ ఒక్కసారిగా ముందుకి దూకింది .

అది చూసి సింహం హడలిపోయింది. హడలిపోయిన సింహం అక్కడనుంచి పారిపోయింది.

బ్రతుకు జీవుడా - అని అక్కడనుంచి మేకపోతు వెళ్లి మందలో కలిసిపోయింది.


నీతి : బలహీనులు కూడా ఒక్కోసారి బలవంతులని ఉపాయం తో ఎదుర్కోవచ్చు. 



    
 

Vemana Padyamulu - Part 1 (వేమన పద్యములు, భాగము - 1)

1
ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ

2
గంగిగోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైన నేల ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు
విశ్వదాభిరామ వినుర వేమ

3
ఆత్మ శుద్దిలేని యాచార మదియేల
భాండ సుద్దిలేని పాకమేల
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినుర వేమ

4
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.

5
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ

6
ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విరిగినేని మరియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ

7
ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ

8
ఆపదైన వేళ నరసి బంధుల జూడు
భయమువేళ జూడు బంటుతనము
పేదవేళ జూడు పెండ్లాము గుణమును
విశ్వదాభిరామ వినురవేమ

9
చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
నీట బడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ

10
చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్కకుక్క కరచి బాధచేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ


 

Telugu Basics - Telugu Letters ( తెలుగు అక్షరములు )

Telugu Letters (తెలుగు అక్షరములు):

Vowels - 16

Consonants -  38

Vowel & Consonants - 3

See the image for more details.

తెలుగులో 57 అక్షరములు వున్నాయి.

అచ్చులు - 16

హల్లులు  - 38

ఉభయాక్షరములు  - 3

 

Telugu Basics - Gunintamulu, Vattulu (తెలుగు గుణింతములు మరియు వత్తులు)

Take help from parents to understand more.

తెలుగు గుణింతములు మరియు వత్తులు :

1. కూడిక పదములు

2. హల్లులుతో కలియునప్పుడు అచ్చులకు వచ్చే రూపభేధములు, వాని నామములు 

3. హల్లుల వత్తులు

 

Names of Stars in Telugu (తెలుగులో నక్షత్రముల పేర్లు)

There are 27 stars as per Panchangam. Each star has it's own name. Following table lists all star's names and their corresponding western star name.

తెలుగులో ఇరువై ఏడు (27) నక్షత్రముల పేర్లు కలవు:


Telugu name Western star name
తెలుగు
Aśvinī β and γ Arietis
అశ్విని
Bharaṇi 3539, and 41 Arietis
భరణి
Kṛttika Pleiades
కృత్తిక
Rōhiṇi Aldebaran
రోహిణి
Mṛgaśira λ, φ Orionis
మృగశిర
Arudra Betelgeuse
ఆరుద్ర
Punarvasu Castor and Pollux
పునర్వసు
Puṣyami γδ and θ Cancri
పుష్యమి
Aśleṣa δ, ε, η, ρ, and σ Hydrae
ఆశ్లేష
Makha or Magha Regulus
మఖ or మాఘ
Pūrva Phalguṇī or Pubba δ and θ Leonis
పూర్వా ఫల్గుణి or పుబ్బ
Uttara Phalguṇi or Uttara Denebola
ఉత్తర ఫల్గుణి or ఉత్తర
Hasta αβγδ and ε Corvi
హస్త
Cittā or Citrā Spica
చిత్తా or చిత్రా
Svāti Arcturus
స్వాతి
Viśākha αβγ and ι Librae
విశాఖ
Anurādhā βδ and π Scorpionis
అనూరాధ
Jyeṣṭha ασ, and τ Scorpionis
జ్యేష్ఠ
Mūla ε, ζ, ηθ, ι, κλμ and ν Scorpionis
మూల
Pūrvāṣāḍha δ and ε Sagittarii
పూర్వాషాఢ
Uttarāṣāḍha ζ and σ Sagittarii
ఉత్తరాషాఢ
Śravaṇaṁ αβ and γ Aquilae
శ్రవణం
Dhaniṣṭha α to δ Delphinus
ధనిష్ఠ
Śatabhiṣaṁ γ Aquarii
శతభిషం
Pūrvābhādra α and β Pegasi
పూర్వాభాద్ర
Uttarābhādra γ Pegasi and α Andromedae
ఉత్తరాభాద్ర
Rēvati ζ Piscium
రేవతి
 

Fortnight (Thithi) names in Telugu - తిధుల పేర్లు

Similar to week names, based on moon movements and positions every day will have a "Thithi".
There are 15 Thithis  as per Telugu panchangam. The group of 15 Thithis are called as Pakshamu (పక్షము).

Each Thithi is identified by associated waxing moon (శుక్ల పక్షము, శుద్ధ పక్షము ) and waning moon (కృష్ణ పక్షము, బహుళ పక్షము) phases.

వారముల పేర్లు ఉన్నట్లే, చంద్రుని రూపము బట్టి ప్రతి నెలను రెండు పక్షాలుగా విభజించారు. ప్రతి పక్షములో  పదిహేను తిథులు ఉంటాయి.


శుక్ల పక్షము లేదా  శుద్ధ పక్షము - Sukla Pakshamu  or Suddha Pakshamu (Waxing Moon):

1. శుద్ధ పాడ్యమి                     - Suddha Padyami
2. శుద్ధ విదియ                      - Suddha Vidiya
3. శుద్ధ తదియ                      - Suddha Tadiya
4. శుద్ధ చవితి                        - Suddha Chaviti
5. శుద్ధ పంచమి                     - Suddha Panchami
6. శుద్ధ షష్టి                           - Suddha Shashti
7. శుద్ధ సప్తమి                      - Suddha Saptami
8. శుద్ధ అష్టమి                      - Suddha Ashtami
9. శుద్ధ నవమి                      - Suddha Navami
10. శుద్ధ దశమి                     - Suddha Dasami
11. శుద్ధ ఏకాదశి                   - Suddha Ekadasi
12. శుద్ధ ద్వాదశి                   - Suddha Dwadasi
13. శుద్ధ త్రియోదశి                - Suddha Triyodasi
14. శుద్ధ చతుర్దశి                  - Suddha Chaturdasi
15. శుద్ధ పౌర్ణమి                    - Suddha Powrnami


కృష్ణ పక్షము లేదా బహుళ పక్షము - Krishna Pakshamu or Bahula Pakshamu (Waning Moon):

1. బహుళ పాడ్యమి                     - Bahula Padyami
2. బహుళ విదియ                      - Bahula Vidiya
3. బహుళ తదియ                      - Bahula Tadiya
4. బహుళ చవితి                        - Bahula Chaviti
5. బహుళ పంచమి                     - Bahula Panchami
6. బహుళ షష్టి                           - Bahula Shashti
7. బహుళ సప్తమి                      - Bahula Saptami
8. బహుళ అష్టమి                      - Bahula Ashtami
9. బహుళ నవమి                      - Bahula Navami
10. బహుళ దశమి                     - Bahula Dasami
11. బహుళ ఏకాదశి                   - Bahula Ekadasi
12. బహుళ ద్వాదశి                   - Bahula Dwadasi
13. బహుళ త్రియోదశి                - Bahula Triyodasi
14. బహుళ చతుర్దశి                  - Bahula Chaturdasi
15. బహుళ అమవాస్య              - Bahula Amavasya

Week day names in Telugu (తెలుగు లో వారముల పేర్లు):


Names of weekdays in Telugu. Each weekday has a commonly used name and a linguistic name.
Also each day is related to a planet as per the "Panchangam".

తెలుగు లో వారములు పేర్లు మరియు ప్రతినామములు. ప్రతీ రోజు ఒక గ్రహము పేరు కలిగి వుంటుంది:

1. ఆది వారము లేదా భానువారము  - Ādivāraṁ or Bhanuvaram - Sunday
Bhanu = Sun

2. సోమవారము లేద ఇందువారము - Sōmavāraṁ or Induvaram - Monday
Soma = Indu = Moon

3. మంగళవారము లేదా భౌమవారము - Maṁgaḷavāraṁ or Bhoumavaram - Tuesday
Mangala = Mars

4. భుదవారము లేదా సౌమ్యవారము  - Budhavāraṁ or Soumyavaram - Wednesday
Bhuda = Mercury

5. గురువారము లేదా బృహస్పతివారము  లేదా లక్ష్మీవారం- Guruvāraṁ  or Bruhaspativaram or Lakshmivaram - Thursday

Guru = Bruhaspati = Jupiter

6. శుక్రవారము లేదా భ్రుగువారము - Śukravāraṁ or Bhrughuvaram - Friday
Sukra = Bhrugu = Venus


7. శనివారము లేదా మందవారము - Śanivāraṁ or Mandavaram - Saturday
Sani = Saturn

Seasons Names in Telugu (ఋతువుల పేర్లు తెలుగులో)

Every year is divided into 6 seasons.

ప్రతీ సంవత్సరం లో 6 ఋతువులు ఉంటాయి.

Following 6 are seasons names in Telugu:

ఈ ఆరు ఋతువుల పేర్లు:


1. Caitram చైత్రం,  Vaiśākham వైశాఖం -> వసంత ఋతువు (Vasaṃta Ṛtuvu)

2. Jyeṣṭha జ్యేష్ఠ, Āṣāḍha ఆషాఢం -> గ్రీష్మ ఋతువు (Grīṣma Ṛtuvu)
3. Śrāvaṇa శ్రావణం, Bhādrapada బాద్రపదం -> వర్ష ఋతువు (Varṣa Ṛtuvu)
4. Aśvayujam ఆశ్విజం, Kārtikam కార్తీకం -> శరదృతువు (Śaradṛtuvu)
5. Mārgaśīrṣam మార్ఘశిరం, Pauṣam పుష్యం -> హేమంత ఋతువు (Hēmaṃta Ṛtuvu)
6. Māgham మాఘం, Phālgunam ఫాల్గుణం -> శిశిర ఋతువు (Śiśira Ṛtuvu)


మేము చిన్నపుడు చదువుకునే రోజుల్లో ఈ విధంగా నేర్చుకునెవాళ్ళమి :

చైత్ర  వైశాఖములు  -> వసంత ఋతువు -> చెట్లు చిగురించి పూలు పూయును. 

జ్యేష్ఠ ఆషాఢములు  -> గ్రీష్మ ఋతువు -> ఎండలు బాగా కాయును. 

శ్రావణ బాద్రపదములు  -> వర్ష ఋతువు -> వర్షములు ఎక్కువగా కురియును.  

ఆశ్విజ కార్తీకములు  -> శరదృతువు -> మంచి వెన్నెల కాయును,

మార్ఘశిర పుష్యములు  -> హేమంత ఋతువు -> మంచు ఎక్కువగా కురియును. 

మాఘ ఫాల్గుణములు  -> శిశిర ఋతువు -> చెట్ల ఆకులు రాలును. 

ఈ ఆరున్ను ఋతువుల పేర్లు, వాటి ధర్మములు .   

Telugu Month Names ( తెలుగు నెలల పేర్లు )

Like how the years have names, the months also have names.

సంవత్సరములకు ఏవిధంగా పేర్లు వున్నాయో అదే విధంగా తెలుగులో నెలలకు కూడా పేర్లు ఉన్నాయి.


Following 12 are the names of the Telugu months:

ఈ పన్నెండు నెలల పేర్లు:

1. Caitram                 - చైత్రం,
2. Vaiśākham             - వైశాఖం
3. Jyeṣṭha                  - జ్యేష్ఠ
4. Āṣāḍham                - ఆషాఢం
5. Śrāvaṇam              - శ్రావణం
6. Bhādrapadam           - బాద్రపదం
7. Aśvayujam            - ఆశ్విజం
8. Kārtikam               - కార్తీకం
9. Mārgaśīrṣam          - మార్ఘశిరం
10. Pauṣam               - పుష్యం
11. Māgham              - మాఘం
12. Phālgunam          - ఫాల్గుణం



Each year is divided into 3 "Kalamulu " (కాలములు ).
ప్రతి సంవత్సరములో మూడు కాలములు ఉండును.

1. వేసవి కాలము (Vesavi Kalamu) - Caitram చైత్రం, Vaiśākham వైశాఖం, Jyeṣṭha జ్యేష్ఠ, Āṣāḍha ఆషాఢం - Summer

2. వర్షా కాలము  (Varsha Kalamu) -  Śrāvaṇa శ్రావణం, Bhādrapada బాద్రపదం, Aśvayujam ఆశ్విజం, Kārtikam కార్తీకం - Rainy Season
3. చలి కాలము (Chali Kalamu) - Mārgaśīrṣam మార్ఘశిరం, Pauṣam పుష్యం, Māgham మాఘం, Phālgunam ఫాల్గుణం - Winter

Telugu Year Names - తెలుగులో సంవత్సరముల పేర్లు

Unlike western system which counts in year numbers, there are 60 years in Telugu calendar. The names repeat after every 60 years.

Current year 2014's name is:  Jaya జయ,  so again year 2074 will be "Jaya".

ఈ సంవత్సరము (2104) పేరు "జయ" నామ సంవత్సరము . మరలా 2074 "జయ" నామ సంవత్సరము గా పిలవ బడుతుంది.  

Children should be interested to know their names.


Names of the years ( సంవత్సరముల పేర్లు):


  1. Prabhava ప్రభవ
  2. Vibhava విభవ
  3. Sukla శుక్ల
  4. Pramoduta ప్రమోద్యూత
  5. Prajothpatti ప్రజోత్పత్తి
  6. Angīrasa అంగీరస
  7. Srīmukha శ్రీముఖ
  8. Bhāva భావ
  9. Yuva యువ
  10. Dhāta ధాత
  11. Īswara ఈశ్వర
  12. Bahudhānya బహుధాన్య
  13. Pramādhi ప్రమాధి
  14. Vikrama విక్రమ
  15. Vrisha వృష
  16. Chitrabhānu చిత్రభాను
  17. Svabhānu స్వభాను
  18. Tārana తారణ
  19. Pārthiva పార్థివ
  20. Vyaya వ్యయ
  21. Sarvajit సర్వజిత్
  22. Sarvadhāri సర్వధారి
  23. Virodhi విరోధి
  24. Vikruti వికృతి
  25. Khara ఖర
  26. Nandana నందన
  27. Vijaya విజయ
  28. Jaya జయ
  29. Manmadha మన్మధ
  30. Durmukhi దుర్ముఖి
  31. Hevalambi హేవళంబి
  32. Vilambi విళంబి
  33. Vikāri వికారి
  34. Sārvari శార్వరి
  35. Plava ప్లవ
  36. Subhakrit శుభకృత్
  37. Sobhakrit శోభకృత్
  38. Krodhi క్రోధి
  39. Viswāvasu విశ్వావసు
  40. Parābhava పరాభవ
  41. Plavanga ప్లవంగ
  42. Kīlaka కీలక
  43. Soumya సౌమ్య
  44. Sādhārana సాధారణ
  45. Virodhikrit విరోధికృత్
  46. Paridhāvi పరిధావి
  47. Pramādi ప్రమాది
  48. Ānanda ఆనంద
  49. Rakshasa రక్షస
  50. NaLa నల
  51. Pingala పింగళ
  52. Kālayukti కాళయుక్తి
  53. Siddhārthi సిద్ధార్థి
  54. Roudri రౌద్రి
  55. Durmathi దుర్మతి
  56. Dundubhi దుందుభి
  57. Rudhirodgāri రుధిరోద్గారి
  58. Raktākshi రక్తక్షి
  59. Krodhana క్రధన
  60. Akshaya అక్షయ

సింగినాదం - జీలకర్ర

సింగినాదం - జీలకర్ర కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే తెలుగులో కొన్ని నానుడులు అసంకల్పితంగా అనేస్తూ ఉంటాము.... కాని వాటి వెనుక ఉన్...